KRNL: కర్నూలు జిల్లాలో బార్లలో నిబంధనల అమలుపై ఆబ్కారీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆబ్కారీశాఖ అధికారి సుధీర్ బాబు, సీఐ చంద్రహాస్ శనివారం కేబీఆర్ బార్‌ను సందర్శించి, మద్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. సురక్షా యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి, వినియోగదారులకు దానిపై అవగాహన కల్పించారు.