E.G: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయితీ పోర్టల్ ద్వారా అన్ని గ్రామపంచాయతీలో నీటి కుళాయి పన్నుల చెల్లింపు సులభతరం అవుతుందని ఈవోపీఆర్డి రాజారావు తెలిపారు. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించాలని కార్యదర్శులను ఆదేశించామన్నారు. డిజిటల్ ద్వారా పన్నుల చెల్లింపులలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.