KRNL: గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షుడు కురువ వెంకటేశ్ గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై ఆదోని MLA డాక్టర్ పార్థసారథి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణతో కలిసి గ్రామానికి వెళ్లిన ఆయన, వెంకటేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.