E.G: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన PGRSను సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, తమ డివిజన్ మండల కేంద్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు అందజేసి సమస్యల పరిష్కారం పొందాలని సూచించారు.