ప్రకాశం: జిల్లా ఏపీ ఎన్జీవో నూతన అధ్యక్షులుగా శరత్, కార్యదర్శులుగా కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు విద్యార్థి జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగ సమస్యలతోపాటు జిల్లా అభివృద్ధి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.