GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ బీఆర్ స్టేడియాన్ని ఇవాళ ఉదయం సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ మరమ్మతులు వేగవంతం చేయాలని, డ్రెయినేజీ క్లీనింగ్, జంగిల్ క్లియరెన్స్, శానిటేషన్‌ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యోగా సెంటర్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.