ATP: పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ఆయనకు పిల్లలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా, మంచి విద్యతో ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తోందని తెలిపారు.