SKLM: శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో MLC దువ్వాడ శ్రీనివాస్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. YSRCP అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులని పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు తిట్టినప్పుడు లేని చట్టం, కేసులు ఇప్పుడు తమపై పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగమేనని అన్నారు. తమపై కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా కేసు పెట్టాలన డిమాండ్ చేశారు.