ATP: సంక్రాంతి పండుగ వేళ కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని జిల్లా ఎస్పీ పీ.జగదీష్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జూదాలకు బదులు నుంచి సంప్రదాయ క్రీడలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.