ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన లైన్స్ క్లబ్ హాల్ వరకు కొనసాగింది. కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.