SKLM: జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజర్ అయ్యారని DEO కే.రవిబాబు తెలిపారు.