VSP: GVMC విస్తరణకు మరో అడుగు పడింది. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లోని 64 గ్రామ పంచాయతీలు.. పెందుర్తి మండలంలోని 15 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ వ్యవహారాల విభాగాన్ని పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది.