SKLM: కొత్తూరు మండలం గొట్టి పల్లి గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గిరి పుత్రుల మెగా వాలీబాల్ టోర్నమెంట్ను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ ప్రారంభించారు. ఇలాంటి గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.