KDP: స్క్రబ్ టైఫస్పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఇది కీటకం కాటు ద్వారా వ్యాపిస్తుందని మండల వైద్యాధికారి మహమ్మద్ తాహా తెలిపారు. చర్మంపై కాలినట్లు కనిపించే చిన్న మచ్చ, దద్దులు 2 రోజులకు మించి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేయించుకోకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.