ATP: జిల్లాలోని ప్రభుత్వ ప్రీ మెట్రిక్ మైనార్టీ బాలికల వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పారశీక, బౌద్ధ మతాల విద్యార్థినులకు ఈ అవకాశం కల్పిస్తారు. వంద మందికి ప్రవేశాలు కల్పిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రామసుబ్బారెడ్డి తెలిపారు. వివరాలకు 9703942423ను సంప్రదించాలి.