TPT: నారాయణవనంలో కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, యువత టీడీపీలో చేరారు. భక్తవత్సల నాయుడు, గోవిందస్వామి, నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శంకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.