NDL: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నందికొట్కూరు పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా మాంజా అమ్మవద్దని గురువారం నందికొట్కూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యువకులు పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో ఎవరు చైనా మాంజా దారం వాడకూడదని సూచించారు. పండుగను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలన్నారు.