ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రం ప్రాంగణంలో కామేపల్లి క్లస్టర్ రైతులతో ఉత్పత్తి నియంత్రణ సమావేశం నిర్వహించారు. వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ రైతులకు ఉత్పత్తి నియంత్రణ యొక్క అవసరాన్ని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. పొగాకు సాగును తగ్గించి ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మారాలని రైతులకు అవగాహన కల్పించారు.