కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో రెండు అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద గొల్లపాలెం బీచ్ కాగా.. రెండవది చిన్న గొల్లపాలెం బీచ్. కృష్ణా జిల్లా అంటే ఇప్పుటి వరకు మంగినపూడి బీచ్ మాత్రమే అనుకునేవారు. మంగినపూడి బీచ్‌ను తలదన్నేలా చిన్న గొల్లపాలెం, పెద్ద గొల్లపాలెం బీచ్‌లు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ బీచ్‌లను సందర్శించవచ్చు.