BPT: యద్దనపూడి ఎమ్మార్వో కార్యాలయం వద్ద శుక్రవారం పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాస్ పుస్తకాలను ఇవ్వడం అభినందనీయమన్నారు.