ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలని, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్లను తొలగించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు.