VSP: సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు.