E.G: వేలివెన్నులో శ్రీ లక్ష్మీ కనకదుర్గ ఆలయ పునఃనిర్మాణంపై మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. నిడదవోలులో జరిగిన ఈ భేటీలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాత వెంకన్నబాబుతో కలిసి నిర్మాణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పలు సూచనలు చేశారని, ఆలయ అభివృద్ధికి సహకరిస్తామన్న హామీపై కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.