GNTR: గుంటూరు జిల్లాలో రానున్న రోజుల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ సూచించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు వచ్చే ఐదు రోజుల పాటు హీట్ ఇండెక్స్ అధికంగా నమోదయ్యే అవకాశముందని తెలిపారు.