GNTR: మంగళగిరి CK హైస్కూల్‌కి ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం బాగా పడిపోయింది. గతంలో జిల్లా స్థాయిలో రాణించిన ఈ ప్రభుత్వ పాఠశాల, ఇప్పుడు మళ్లీ పాత ప్రతిష్ఠను తెచ్చుకుంటుందా అన్నది చూడాలి. విద్యాశాఖ అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను టీచర్లు కచ్చితంగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.