కడపలోని YVU ఎంబీఏ విభాగంలో సీనియర్ విద్యార్థులు మంగళవారం రాత్రి జూనియర్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థి లక్ష్మీకాంత్ మద్యం మత్తులో జూనియర్పై దాడి చేశాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని, ర్యాగింగ్ అరికట్టి విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.