NTR: గన్నవరంలో ఇరిగేషన్ పెండింగ్ పనులను, కొత్తగా మంజూరైన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులు ఆదేశించారు. విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో పలు పనుల పురోగతిపై నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని కాలువల మరమ్మత్తులు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.