కోనసీమ: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు . ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లొద్దన్నారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.