NTR: సంక్రాంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆమె సూచించారు. టోర్నమెంట్ విజేతలకు రూ.50,116, రూ.30,116, రూ.20,116 నగదు బహుమతులు ప్రకటించారు.