ప్రకాశం: మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలంలో ఆదివారం ఓ ఆటో అకస్మాత్తుగా టిప్పర్‌కు అడ్డంగా రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, టిప్పర్ డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. స్థానికులు డ్రైవర్‌ను అభినందిస్తూ, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.