NDL: లోక కళ్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి గురువారం విశేష పూజలు చేశారు. ప్రతీ గురువారం దేవస్థానం సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపిస్తారు. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజలు జరిపించి, దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు.