PLD: సత్తెనపల్లి పట్టణంలోని 31వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ ప్రవేశ కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని లబ్ధిదారులకు గృహ తాళాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు అన్నారు.