అన్నమయ్య: రాయచోటి పోలీస్ కార్యాలయంలో రేనాటి యోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటీష్ పాలకులపై పోరాడిన ధీరుడు వడ్డె ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. యువత ఓబన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.