CTR: పుంగనూరు మండలం, భీమాగానిపల్లి కోదండ రామాలయం ధర్మకర్తలు, గ్రామస్థులు ఆదివారం పుంగనూరు ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ సీతరామ, లక్ష్మణ, హనుమాన్ సమేత విగ్రహం ప్రతిష్ట కుంభాభిషేకానికి ఆహ్వానించి పత్రిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.