కడప: బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా.దాసరి సుధ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడుతూ అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. జనరల్ వార్డు, ఓ.పీ, రిజిస్టర్, డయాలసిస్ యూనిట్‌ను పరిశీలించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.