GNTR: అమరావతిలోని నీరుకొండపై సుమారు 3500 టన్నుల కంచుతో నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు డిజైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తాజాగా పరిశీలించి ఖరారు చేసింది. AGICL పర్యవేక్షణలో సాగే ఈ నిర్మాణం రాజధానిలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలవనుంది.