GNTR: రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో డీఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.