SKLM: సోంపేట కోర్టు పేట ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తంగుడు మనోజ్ తన ఇంటికి తాళం వేసి ఫంక్షన్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి 30 తులాల బంగారం, రూ.1 లక్ష నగదును దొంగ లించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మంగరాజు పేర్కొన్నారు.