TPT: సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతిలోని ఎస్పీడీసీల్ సీఎండీ శివశంకర్‌ను కోరారు. ఇందులో భాగంగా ముడియూరు సబ్ స్టేషన్ టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని, చమర్తి కండ్రిగ సబ్ స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరగా, సీఎండీ దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.