W.G: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ పేరుతో మంత్రి నారా లోకేష్ అక్రమంగా అరెస్ట్ చేయించారని వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.