CTR: జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురంలో 2026-27 విద్యా సంవత్సరానికి మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినుల కోసం మొదటి సంవత్సరంలో బిఎ (హిస్టరీ, ఎకనామిక్స్), బీకాం, బీఎస్సీ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత విద్యార్థినుల ఉన్నత విద్యకు ఇది ఎంతగానో దోహదపడనుంది.