ప్రకాశం: తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం పంచాయతీ రెడ్డిసాగర్ వద్ద భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. గేదెల కొట్టంలోని డ్రమ్ములోకి దూరిన కొండచిలువను రైతు గుర్తించి అటవీశాఖకు సమాచారమిచ్చాడు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని పట్టుకున్ని దానిని సురక్షితంగా. సుమారు 15 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువ కారణంగా ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.