PLD: రాజధాని నిర్మాణానికి రైతుల మద్దతు వెల్లువెత్తుతోంది. గురువారం పెదమద్దూరులో మంత్రి నారాయణ, MLA భాష్యం ప్రవీణ్ ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై ఉన్న విశ్వాసంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, గంట వ్యవధిలోనే 313 ఎకరాల అంగీకార పత్రాలు అందాయి. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.