W.G: భీమవరం చినరంగనిపాలెంలో గత నెల 27వ తేదీన కత్తులతో విద్యార్థులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వగా కోలా ఆనంద్, ప్రకాష్‌లను ఒకటో తేదీన అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ నాగరాజు తెలిపారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించిందన్నారు.