W.G: ఉండి మండలం కలిగొట్ల క్లస్టర్ ఆరేడులో క్లస్టర్ కన్వీనర్ పొత్తూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.