PLD: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం మాచర్ల అర్బన్ ఎస్ఐ సంధ్యారాణి తెలిపారు. స్థానిక 7వ వార్డుకు చెందిన బాలికపై అదే వీధిలో నివసిస్తున్న ఓ యువకుడు నిత్యం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.