ATP: శెట్టూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు రంగనాథ్ శెట్టి కుమారుడు రవితేజపై దాడి జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను పరామర్శించారు. ఆయన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి, రవితేజకు ధైర్యం చెప్పారు.