NLR: సంగం సర్కిల్ పరిధిలోని ప్రజలకు సీఐ శ్రీనివాసులు రెడ్డి ఇవాళ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు మండలాల్లో కోడి పందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. పండుగ సమయాలలో రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.