W.G: యలమంచిలి మండలంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మట్లపాలెం, మెరక, వడ్డీలంక, గంగడపాలెం గ్రామాలకు చెందిన 200 మంది పాడి రైతులకు 50 శాతం ప్రభుత్వ సబ్సిడీపై పశు దాణా బస్తాలను మంత్రి రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.