NDL: శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఆదివారం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలుకు వెళ్లేందుకు కేవలం ఎక్స్ప్రెస్ బస్సులే అందుబాటులో ఉండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. వేసవి తాపానికి భక్తులు అల్లాడుతున్నారని, RTC అధికారులు స్పందించి అదనపు బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు.